ఆ స్టార్ హీరోయిన్ ను చూడ‌గానే బాటిల్ ప‌గ‌ల‌గొట్టిన రానా.. అంత మండే ప‌ని ఏం చేసింది?

రానా ద‌గ్గుబాటి.. ఆన్ స్క్రీన్ పై ఎంత అగ్రెసివ్ పాత్ర‌లు చేసినా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. అంద‌రితోనూ త్వ‌ర‌గా క‌లిసిపోతారు. జోకులు వేస్తూ కామెడీ చేస్తాడు. కానీ, అటువంటి హీరోకు ఓ స్టార్ హీరోయిన్ బాగా కోపం తెప్పించింద‌ట‌. ఎంత‌లా ఆమెను చూడ‌గానే చేతిలో ఉన్న బాటిల్ ప‌గ‌ల‌గొట్టేంత‌. తాజాగా రానా స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాణ్‌, డైరెక్ట‌ర్ అభిలాష్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `కింగ్ ఆఫ్ కోత` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఆగ‌స్టు 24న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆదివారం నాడు హైద‌రాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా.. రానా, నాని గెస్ట్ లుగా హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. `దుల్కర్ చాలా సున్నితమైన వ్యక్తి. అయితే దుల్కర్ ఒక బాలీవుడ్ మూవీ చేస్తున్న‌ప్పుడు ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్సే కావడంతో షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాను.

ఆ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ న‌టిస్తోంది. అయితే టేక్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ధ్య‌లో స‌ద‌రు హీరోయిన్ త‌న భ‌ర్త‌తో ఫోన్ మాట్లాడుతోంది. లండన్ లో అత‌ను షాపింగ్ చేస్తున్నాడ‌ట‌. ఈవిడ దానిగురించి మాట్లాడుతోంది. టేక్ జరుగుతున్నప్పుడు డైలాగ్ సరిగ్గా చెప్పడం లేదు. ఆమె వల్లే టేక్స్ మీద టేక్స్ అవుతున్నాయి. ఆమె తీరుకు అక్క‌డ వారంతా అస‌హ‌నానికి గుర‌య్యారు. చివ‌ర‌కు అదంతా దూరం నుంచి చూస్తున్న నాకు కూడా మండిపోయి చేతిలో ఉన్న బాటిల్ ప‌గ‌ల‌గొట్టేశా. ఆమె వెళ్ళాక నిర్మాతలని ఇష్టం వచ్చినట్లు తిట్టేశా. కానీ, దుల్క‌ర్ మాత్రం చాలా కూల్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఏ మాత్రం త‌న స‌హ‌నాన్ని కోల్పోలేదు. అది దుల్క‌ర్ అంటే. మంచి వ్య‌క్తిత‌త్వ‌మే దుల్క‌ర్ ను ఈ స్థాయిలో నిల‌బెట్టింది` అంటూ రానా చెప్పుకొచ్చాడు. దీంతో రానాకు కోపం తెప్పించిన ఆ హీరోయిన్ ఎవ‌రా అని నెటిజ‌న్లు సెర్చ్ చేయ‌డం షురూ చేశారు.