దేవ‌ర‌తో OG పోటీయా… అంత సాహ‌సం వ‌ద్దు ప‌వ‌న్‌…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న దేవర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓజీ కూడా వచ్చేయడాది సమ్మర్ లోనే రిలీజ్ కాబోతుందట. ఎన్టీఆర్ దేవర సినిమాకు పవర్ స్టార్ ఓజి మూవీ రిలీజ్‌కి మధ్యన ఒక వారం మాత్రమే తేడా ఉంటుందట. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ – పవన్ ల మధ్యన గట్టి పోటీ జరగబోతుందంటూ న్యూస్ వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలో వీటిపై స్పందించిన హాట్ బ్యూటీ శ్రీరెడ్డి పలు కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మెగా ఫ్యామిలీ పై దుమారం రేపే పోస్టులను చేస్తూ ఉండే శ్రీ రెడ్డి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీ రెడ్డి మాట్లాడుతూ రెండు వారాల గ్యాప్ లోనే మొదట తమ్ముడు సినిమా, తర్వాత అన్నయ్య సినిమా 2 రిలీజై అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలాంటి పోటీ లేకుండానే ఇలా ఫ్లాప్ అయ్యాయి అంటే ఇక ఏప్రిల్ లో దేవరతో పోటీ అంటే సాహసం అనే చెప్పాలి.. అంటూ కామెంట్ చేసింది.

 

దీంతో మెగా ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతాయని కాదు మా హీరోలు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్‌ల‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నువ్వు వారిని తక్కువ అంచనా వేసి మాట్లాడటం క‌రెక్ట్‌ కాదు అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. కొంతమంది మెగా ఫ్యాన్స్ శ్రీరెడ్డిని బండ బూతులతో తిట్టిపోస్తున్నారు.