‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. పూరి మ‌రో లైగ‌ర్ తీయ‌వుగా…!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్‌ ఇస్మార్ట్ రూపొందుతోంది. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్ లో స్టార్ట్ అయింది.

ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ విల‌న్ రోల్‌లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్ లో సంజయ్ దత్ చాలా వైల్డ్ గా కనిపించబోతున్నాడట. ఇక ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8,2024న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. పూరి జగన్నాథ్ మరియు చార్మి కౌర్ కలిసి పూరి కాన్సెప్ట్స్ పై విష్ణు రెడ్డి సీఈవోగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించిబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో ఫాన్స్ ప‌లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాథ్ సినిమాలు అంటే ఎంతో స్పీడుగా షూటింగ్ కంప్లీట్ అవుతుంది అన్న సంగతి తెలిసిందే. అలా హడావిడిగా ఈ సినిమా తెరకెక్కించి లైగ‌ర్ లాగా మరో డిజాస్టర్ను తీయవుగా పూరి జగన్నాధ్ అంటూ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.