కమెడియన్ బ్రహ్మానందం కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిలేరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. కమెడియన్ గా బ్రహ్మానందం ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు. కేవలం ఈ నటుడి కామెడీ కోసమే సినిమాకి వచ్చే ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ఈ హాస్య నట చక్రవర్తి 1956, ఫిబ్రవరి 1 న గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం చాగంటి వారిపాలెంలో జన్మించాడు. ఎం ఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెద్దల ఆశీర్వాదంతో లక్ష్మి ని వివాహం చేసుకున్నాడు.

వీరికి రాజా గౌతమ్, సిద్ధార్థ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. బ్రహ్మానందం తండ్రి నాటకాలు వేయడంతో, ఆయన కూడా నాటకాలపై మక్కువ ఎక్కువగా ఉండేది. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘అహనా పెళ్ళంట ‘ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టాడు. ఆ సినిమాలో అరగుండు బ్రహ్మానందం పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. 1987లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బ్రహ్మానందం తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.

అయితే ఈ సినిమాకి గాను బ్రహ్మానందం 6,000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అహ నా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం పాత్ర చిరంజీవికి నచ్చడంతో ‘పసివాడి ప్రాణం’ సినిమాలో బ్రమ్మీకి చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత 1994లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు 2003లో బెస్ట్ మెయిల్ కమెడియన్‌గా , 2009లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు బ్రహ్మానందం. ప్రస్తుతం బ్రహ్మానందం నటించే సినిమాలకు కోటి నుండి కోటి యాభై లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ఆయనకు ఇష్టమైన హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున. అలానే హీరోయిన్స్ లో మహానటి సావిత్రి అంటే బ్రహ్మానందంకి చాలా ఇష్టమట. బ్రహ్మానందంకి యాక్టింగ్ తో పాటు డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయనకు మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి. ప్రస్తుతం బ్రహ్మీ హైదరాబాద్ మణికొండలోని పంచాయతీ ట్రావెల్స్ లో దాదాపు ఏడు కోట్ల విలువైన ది ట్రాయల్స్ విల్లాలో ఉంటున్నాడు. బ్రహ్మానందం ఆస్తి విలువ రూ.500 నుండి రూ.600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇద్దరు కొడుకులు కూడా బాగా సంపాదిస్తూ మంచి స్థాయిలో ఉన్నారు.