పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కుర్రకారులకు తన అందాలతో ఆకట్టుకుంది హీరోయిన్ తాప్సి.. మొదట ఝుమ్మంది నాదం సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది కానీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. కానీ గత రెండేళ్ల నుంచి ఆమె సరైన సక్సెస్ అయితే అందుకోలేక పోతోంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా విభిన్నమైన ప్రయోగాత్మకంగా సినిమాలను చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.

Taapsee Pannu fan asked when will get married she replied not pregnant yet - तापसी पन्नू का किसकी ओर इशारा? शादी के सवाल पर बोलीं- अभी तक प्रेग्नेंट नहीं हुई हूं

సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే తప్ప ఆటువైపుగా తిరిగి చూడలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక చిట్ చాట్ లో పాల్గొన్న తాప్సి అభిమానులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియజేసింది.. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే ప్రశ్న తాప్సికి ఎదురవ్వగా.. నా పెళ్లి ఎప్పుడు అవుతుందో అని చాలామంది అడుగుతున్నారు. అయితే నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు గర్భవతిని కాదు కాబట్టి నా పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చు ఒకవేళ అలా ఏదైనా జరిగే అవకాశం ఉంటే తప్పకుండా చెబుతాను అంటూ తాప్సి ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది..

ఒక విధంగా ఈ రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో తాప్సి ఒకరికి కౌంటర్ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇటీవల ఇలియానా కూడా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. ఇక త్వరలోనే డెలివరీ కూడా కాబోతోంది తనకు పుట్టబోయే బిడ్డకు భర్తను సోషల్ మీడియాలో రీవిల్ చేసింది ఇలియానా. ఇక తాప్సి ప్రస్తావన రాగానే పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు అనే డైలాగ్ రావడానికి కౌంటర్ ఇచ్చిందా లేకపోతే మరొక విధంగా మాట్లాడింద అనే విషయం అభిమానులకు అర్థం కావడం లేదు.