వార్ -2 లో ఎన్టీఆర్ పాత్ర హైలెట్గా నిలిచేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్లోకి వార్-2 చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో విలన్ గా నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొదట ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్నేహితులుగా ఉంటారట. ఆ తర్వాత శత్రువులుగా మారుతారని తెలుస్తోంది. ఈ సినిమాని కృష్ణార్జునల పాత్రలను రెఫరెన్స్ తీసుకొని కృష్ణుడి పాత్రను పోలి ఉండేలా ఎన్టీఆర్ ను అర్జునుడి పాత్రను పోలి ఉండేలా హృతిక్ రోషన్ పాత్ర ఫిక్స్ చేసినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

War 2: If Jr. NTR Had Declined To Star Opposite Hrithik Roshan, YRF Had Options From Hindi Film Industry & Not South, Here's How It Was Planned!

వార్ -2 లో ఎన్టీఆర్ రోల్ చాలా నెగిటివ్ స్టేజ్ లో ఉండబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రం 2025 లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. వార్ -2 లో ఎన్టీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథలుగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్ విషయానికి వస్తే దేవర సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్లను మాత్రం సైలెంట్ గా పూర్తి చేసుకుంటూ అభిమానులను ఆనందాన్ని కలిగిస్తున్నారు వరుసగా మూడు ప్రాజెక్టులను ప్రకటించగా ఈ సినిమాలను కొన్ని నెలల గ్యాప్ వ్యవధిలోని థియేటర్లో విడుదల చేయడం గమనార్హం. సిరివారపు సంపాదించి ఎలాంటి పొరపాటు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ను చాలా ప్లానింగ్ తోనే ముందుకు తీసుకు వెళుతున్నారని అభిమానులు తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాలీవుడ్ యాక్టర్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.