Project-k నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్..!!

 ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారి బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో అమితాబచ్చన్,కమలహాసన్ దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడం చేత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలో దీపికా పదుకొనే నటించడం జరుగుతోంది ఆమెకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వెలుబడినా సరే ప్రేక్షకులలో ఆసక్తి మొదలవుతోంది. ఈ చిత్రం దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా టైటిల్ ని కూడా ఈ నెలలోనే రివీల్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలలో చిత్ర బృందం పాల్గొని అక్కడ టైటిల్ను ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

అలాగే ప్రాజెక్ట్ -k రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం ప్రపంచం మొత్తం చాలా అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఇక అందుకు సంబంధించిన అప్డేట్లను సైతం చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది .శాన్ డియాగో కామిక్ కాన్ వేదిక పైన ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్న తొలి ఇండియన్ చిత్రంగా ప్రభాస్ ప్రాజెక్ట్ -k చిత్రం ఒక చరిత్ర సృష్టించబోతోంది. మరి ఏ మేరకు అభిమానులను ఈ చిత్రం నేర్పిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ వైరల్ గా మారుతోంది.