వాలంటీర్ల టార్గెట్‌గా పవన్..జగన్‌కు డ్యామేజ్ తప్పదా?

జగన్ అధికారంలోకి రాగానే తాము అందిస్తున్న పథకాలని ప్రజలకు అన్ధెలా చేయడానికి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా పథకాల అర్హులు ఎవరు అనేది వారే నిర్ణయిస్తున్నారు. వారే పథకాలని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈ పరంగా వాలంటీర్ల పని వైసీపీకి పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండే సైడ్ ఉంది. వాలంటీర్లు అంటే న్యూట్రల్ గా ఉండేవారు కాదు..పక్కా వైసీపీ కార్యకర్తలు. వారు అనుకున్న వారికే పథకాలు..వైసీపీకి మద్ధతుగా లేని వారికి పథకాలు రావు.

వైసీపీకి వ్యతిరేకంగా మారితే పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తారు. ఆ మధ్య లోకల్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు కట్ అని చెప్పి ఓట్లు వేయించారు. ఇక వీరి వల్ల ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. తాము చేయడానికి ఏం ఉండటం లేదని వారు బాధపడుతున్నారు. అదే సమయంలో ఓటర్ల లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయి. దీనికి కారణం వాలంటీర్లే అనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థపై ప్రజలు ఆగ్రహం వచ్చేలా చేశాయి.

ఇక ఇప్పుడు పవన్ కల్యాణ్ చేసిన సరికొత్త ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో కొందరు మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని,  వైసీపీ పాలనలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమైతే..14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో వాలంటీర్లని పెట్టి..కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? వారిలో మహిళలు ఎంతమంది? వితంతవులు ఎంతమంది అని ఆరా తీస్తున్నారని, ప్రధానంగా ఒంటరి మహిళలే టార్గెట్ గా సమాచారం సేకరించి సంఘ విద్రోహశక్తులకు ఇస్తున్నారని అన్నారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం తనకు సమాచారం ఇచ్చిందని పవన్ చెప్పుకొచ్చారు. అయితే కొందరు వాలంటీర్ల టార్గెట్ గానే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాకపోతే మొదట నుంచి కొందరు వాలంటీర్లు మహిళలని ఇబ్బంది పెడుతున్నారని, పింఛన్ డబ్బులతో పారిపోతున్నారని, రౌడీయిజం చేస్తున్నారని కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మహిళలు మిస్ అవుతున్నారని పవన్ విమర్శలు చేయడం..వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైసీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగేలా ఉంది.