ఈ రోజే డిశ్చార్జ్ కాబోతున్న ఉపాస‌న‌.. ఇంత‌కీ ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చేనా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు పెళ్లైన 11 ఏళ్ల త‌ర్వాత త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. జూన్ 20వ తేదీన ఉపాస‌న హైద‌రాబాద్ లోని అపోలో హాస్ప‌ట‌ల్ లో పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాక‌తో మెగా ఫ్యామిలీలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

గ‌త మూడు రోజుల నుంచి ఉపాస‌న‌, ఆమె బిడ్డ‌ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. అయితే ఈ రోజే ఉపాస‌న డిశ్చార్జ్ కాబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బిడ్డ‌తో ఉపాస‌న దంప‌తులు నేరుగా చిరంజీవి ఇంటికే వెళ్ల‌బోతున్నారు. ఇక‌పోతే మెగా అభిమానులతో పాటు చాలా మందికి ఓ సందేహం ఉంది.

ఉపాసనకు నార్మల్ డెలివరీ అయ్యిందా? లేదంటే సిజేరియన్ చేశారా? అని. అయితే ఈ విష‌యంపై నేడు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇంటికి వెళ్ళే ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు అపోలో ఆస్పత్రి దగ్గర మీడియాతో మాట్లాడనున్నారు. ఆ స‌మ‌యంలో త‌మ‌ను విష్ చేసిన వారంద‌రికీ థాంక్స్ చెబుతారు. మ‌రి ఆ టైమ్‌లో డెలివరీకి సంబంధించిన విష‌యాల‌పై ఉపాస‌న నోరు విప్ప‌నుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.