జబర్దస్త్ అప్పారావు చనిపోయాడని వార్తలు.. అవి తల్చుకొని ఏడ్చేసిన కమెడియన్..

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. వారిలో అప్పారావు కూడా ఒకరు. అప్పారావు మొదట సినిమాల్లో ఆర్టిస్టుగా చేశాడు. కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయాడు. ఎప్పుడైతే జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టాడో అప్పటినుంచి అప్పారావు కెరీర్ ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆయన జబర్దస్త్ లో చాలామంది టీమ్‌ లీడర్స్‌తో కలిసి పని చేశాడు. మొదట ఎక్కువగా చలాకీ చంటి స్కిట్స్ లో చేసే అప్పారావు ఆ తరువాత సుధీర్ స్కిట్స్లో  పని చేసాడు.

 

 

అయితే కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోస్ లో కూడా పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవాడు అప్పారావు. దాదాపు 2013 నుంచి జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ ప్రేక్షకులు అలరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అప్పారావు జబర్దస్త్ షోపై చేసిన వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. షోలో కొంతమంది కారణంగా కమెడియన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అంటూ అప్పారావు ఆవేదన వ్యక్తం చేశాడు. మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో కొంతమంది కమెడియన్లకు చాలా అన్యాయం జరుగుతుందని, అందుకే నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసాను అంటూ అప్పారావు తెలిపాడు.

ఈమధ్య అప్పారావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో అప్పారావు చాలా ఎమోషనల్ అయ్యాడు. నటులు బ్రతికుండగానే వారిని చంపేస్తున్నారు, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆయన దాదాపు ఏడ్చేసాడు. “యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమంది వ్యక్తులు బతికున్న సెలబ్రిటీలను చనిపోయారంటూ ప్రచారం చేస్తున్నారు. అలా బ్రతికి ఉన్న కూడా చనిపోయాడు అంటూ ప్రచారం చేస్తున్న సెలబ్రిటిలో నేను కూడా ఒకడిని…

అలా నాపై తప్పు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ వాళ్లంతా ఇప్పుడు నేను చెప్పేది స్పష్టంగా వినండి. మీ వల్ల చాలామంది ఆర్టిస్టులు, సెలబ్రెటీలు మానసికంగా ఎంతో బాధపడుతున్నారు. బ్రతికుండగానే చనిపోయారంటూ ఆర్టిస్టులు , సెలబ్రెటీల గురించి థంబ్ నైయిల్స్‌ పెడుతున్నారు. అలా అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. అనవసరంగా ఇతరుల జీవితాలతో ఆడుకోకండి’ అంటూ అప్పారావు వారికి విజ్ఞప్తి చేశాడు.