టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇటీవల ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డితో శార్వానంద్ ఏడడుగులు వేశాడు.
జూన్ 3వ తేదీన జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వా, రక్షితల పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు హల్దీ, సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలను కూడా అట్టహాసంగా నిర్వహించారు.
వీరి ఈ వివాహ వేడుకకి రెండు కుటుంబాలకు చెందినవారు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ లో జూన్ 9న శర్వానంద్, రక్షిత రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ వైభవంగా జరిగింది.
రిసెప్షన్ లో నూతన జంట అందంగా మెరిసిపోయారు. శర్వానంద్ వెస్ట్రన్ స్టైల్ లో వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించగా.. రక్షిత రెడ్డి పింక్ కలర్ డిజైనర్ శారీలో అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
అలాగే ఈ వేడకలో సినీ, రాజకీయ తారలెందరో సందడి చేశారు. రామ్ చరణ్, నితిన్, నిఖిల్, అల్లరి నరేష్, దిల్ రాజు సతీసమేతంగా విచ్చేశారు.
బాలకృష్ణ, వెంకటేష్, అమల అక్కినేని, రీతూ వర్మ, జీవిత రాజశేఖర్ వారి కుమార్తెలు, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ ఇలా చాలా మంది సినీ తారలు విచ్చేసిన కొత్త జంటను ఆశీర్వదించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్ కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ కూడా శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.