కొడాలికి చిక్కులు..ఇలా టార్గెట్ అయ్యారే.!

ఏపీలో పవర్‌ఫుల్ నాయకుల్లో కొడాలి నాని ఒకరు..ఈయన చంద్రబాబుని తిట్టే తిట్లు గురించి అందరికీ తెలిసిందే. ఇక కొడాలి తిట్టినట్లుగా బాబుని మరొక నేత తిట్టారు. కేవలం బాబుని తిట్టడానికే కొడాలి ఉన్నారా? అన్నట్లు పరిస్తితి ఉంటుంది. ఆ విషయం పక్కన పెడితే..రాజకీయంగా గుడివాడలో నానికి తిరుగులేదు. అక్కడ ఆయన దూకుడు వేరు. ప్రజా మద్ధతు కూడా ఎక్కువే.

అయితే ఇంతకాలం ఆ బలంతో విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ ఇటీవల కాస్త సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ నాలుగేళ్ళు అధికారంలో ఉంటూ కూడా గుడివాడలో పెద్దగా అభివృద్ధి చేసిందేమి లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో అంటే అధికారంలో లేరు..ఏం చేయలేకపోయారని ప్రజలు పదే పదే గెలిపిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు..రెండున్నర ఏళ్ళు మంత్రిగా చేశారు. అయినా సరే అనుకున్న మేర గుడివాడలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఎదురుకుంటున్నారు. ఇదే సమయంలో తాజాగా టిడ్కో ఇళ్ల ఓపెనింగ్‌కు జగన్ రావాలి..కానీ ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాక ఆయన పర్యటన వాయిదా పడింది.

దీంతో కొడాలికి కాస్త చేదు అనుభవం ఎదురైంది. పైగా జగన్ ప్రారంభించే టిడ్కో ఇల్లు టి‌డి‌పి హయాంలో కట్టినవే..వాటికి వైసీపీ రంగులు వేశారు. కానీ కనీస మౌలిక సదుపాయాలు..కరెంట్, రోడ్లు ఏర్పాటు చేయకుండా ఇల్లు ప్రారంభించాలని చూశారు. కానీ ఎందుకో గాని జగన్ పర్యటన వాయిదా పడింది.

దీంతో కొడాలి నానికి కాస్త ఇబ్బందికర పరిస్తితి ఏర్పడింది. లక్షల రూపాయలు ప్రజా ధనం వృధా చేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే గతంలో టి‌డి‌పి మహానాడు ఏర్పాటు చేయగా, అప్పుడు వానలు వచ్చి వాయిదా పడింది. అప్పుడు వైసీపీ శ్రేణులు టి‌డి‌పిపై కౌంటర్లు వేశాయి. ఇప్పుడు జగన్ పర్యటన వాయిదా పడటంతో రివర్స్ లో టి‌డి‌పి కౌంటర్లు వేస్తుంది.