టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి లాస్ట్ నైట్ ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. `ఇట్స్ మై లావణ్య, ఫౌండ్ మై లవ్` అంటూ వరుణ్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
హైదరాబాద్ లో జరిగిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కు మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నాడు. త్వరలోనే పెళ్లి వేడుక కూడా జరగబోతోంది. అయితే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లికి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ఇండియాలో కాకుండా ఏకంగా ఇటలీ వెళ్లి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. పెళ్లి కోసం వీరిద్దరూ అంత దూరం వెళ్లడానికి కారణం లేకపోలేదు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తొలి చిత్రం `మిస్టర్`.
వీరిద్దరి ప్రేమకి బీజం పడింది ఈ మూవీతోనే అట. మిస్టర్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఇక ప్రేమ చిగురించిన చోటే పెళ్లి చేసుకోవాలని వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి భావిస్తున్నారట. అందుకు ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి పెట్టింది పేరు. ఇప్పటికే కొందరు సినీ తారలు అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కూడా చేరనుందని టాక్.