జయలలిత కోసం శోభన్ బాబు అన్ని త్యాగాలు చేశారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సోగ్గాడిగా అందగాడుగా ఎన్నో పేరు ప్రతిష్టలు పొందారు శోభన్ బాబు.. శోభన్ బాబు జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆర్థికంగా ఆయన ఎంతో బలవంతుడు కానీ మానసికంగా మాత్రం కొన్ని కట్టుబాట్లకు పరిమితమయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో శోభన్ బాబుకు చాలా దగ్గర బంధుత్వం ఉందని ఈ నేపథ్యంలోనే అన్నగారితో కలిసి ఎన్నో సినిమాలలో శోభన్ బాబు నటించిన సహచరులు తెలియజేస్తూ ఉంటారు.

Jayalalithaa-Sobhan Babu Affair Secrets Out | cinejosh.com
తమ్ముడు అనే చోరుతో ఎన్టీఆర్ కూడా శోభన్ బాబుకు ఒక కుటుంబ సభ్యుడిగా చేరువయ్యారట.. తమిళంలోనే కాకుండా తెలుగులో బ్లాక్ అండ్ వైట్ మూవీలలో కూడా తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ జయలలిత శోభన్ బాబుతో ఏర్పరచుకున్న సంబంధం పై ఇప్పటికీ అనేక కథనాలు వినిపిస్తూనే ఉంటాయి.. వీరి బంధానికి గుర్తుగా ఒక చిన్నారి ఉందని ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది.. తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్కు వచ్చేయడంతో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ చాలా కృషి చేశారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

Rare moments: Sobhan Babu, Jayalalithaa and more
అలాంటి సమయంలోనే శోభన్ బాబుకు స్టూడియో కట్టించేందుకు ఎన్టీఆర్ హైదరాబాదులో స్థలాన్ని చూపించారట.దీనికి కూడా ఆయన ఒప్పుకున్నారట.. కానీ తమిళనాడు వదిలి వెళ్ళవద్దని జయలలిత పెట్టిన కండిషన్తో శోభన్ బాబు నిలిచిపోయారని సమాచారం..అందుకే ఆయనకు హైదరాబాదులో ఒక ఇల్లు తప్ప అప్పట్లో ఏమీ లేదని ప్రచారం ఉంది. జయలలిత కోసం శోభన్ బాబు చేసిన త్యాగాలలో మరొకటి ఏమిటంటే సినిమాలను వదులుకోవడం.. జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు వదులుకున్నారు.. ఇదే సమయంలో శోభన్ బాబు పైన ఒత్తిడి తెచ్చి సినిమాలకు దూరం కావాలని కోరడంతో ఆయన కూడా దాదాపుగా సినిమాలు తగ్గించి పలు రియల్ ఎస్టేట్ వ్యాపారవాళ్ళ పైన మగ్గు చూపే వారని సమాచారం.