నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ ఏడడుగులు వేయబోతున్నాడు. జూన్ 9న హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఉంగరాలు మార్చుకున్నారు.
ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో షాకింగ్ వీడియో వైరల్ గా మారింది. అసలు ఈ వీడియోలో ఏముందంటే.. చావు కబురు చల్లగా సినిమా ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠి అందరికీ హాయ్ చెబుతుండగా.. ఆ మూవీ నిర్మాత అల్లు అరవింద్ ఎంతో చనువుగా ఆమె నుంచి మైక్ తీసుకున్నారు. `ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి తెలుగు బాగా నేర్చుకుని మాట్లాడేస్తోంది. ఈ అమ్మాయి ఇక్కడే ఒక కుర్రాడిని చూసుకొని పెళ్లి చేసుకుని సెటిలైపోతే బాగుంటుంది కదా` అంటూ అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.
ఆయన మాట్లాడుతూ లావణ్య తెగ సిగ్గు పడిపోయింది. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. వరుణ్-లావణ్య లవ్ మ్యాటర్ పై రెండేళ్ల క్రితమే మీరు హింట్ ఇచ్చారు, మేమే గ్రహించలేకపోయాము అని కొందరు.. అల్లు అరవింద్ ఆ నాటు చెప్పినందుకే లావణ్య వరుణ్ ను బుట్టలో పడేసిందని మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కిపోతే ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది.
https://twitter.com/jananetra/status/1667256128735154176?s=20