నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `భగవంత్ కేసరి`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ ను లాంఛ్ చేసిన మేకర్స్.. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా `భగవంత్ కేసరి` టీజర్ ను బయటకు వదిలారు. `రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు` అని బాలకృష్ణ చెప్పే డైలాగ్ లో ప్రారంభమైన టీజర్ అదిరిపోయిందనే చెప్పాలి.
తెలంగాణ యాసలో, హిందీలో డైలాగ్స్ చెప్పి బాలయ్య దుమ్ము దులిపేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్, విజువల్స్, బీజీఎమ్ నెక్స్ట్ లెవల్. `అడివి బిడ్డ.. నేలకొండ భగవత్ కేసరి.. ఈ పేరు చాలా యేండ్లు యాద్ ఉంటది` అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక చివర్లో బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి టీజర్ తోనే `భగవంత్ కేసరి`పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. కొందరు టీజర్ చూసి బాలయ్య హ్యాట్రిక్ ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందు రాబోతోంది.