పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రం రీ రిలీజ్.. ఎప్పుడంటే..?

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాలు హవా బాగా కొనసాగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ ,ప్రభాస్ ,అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తదితర హీరోలు సైతం మరొకసారి పాత సినిమాలతో ప్రేక్షకులందుకు వచ్చి బాగానే ఆకట్టుకున్నారు.ఇక కలెక్షన్ల పరంగా కూడా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ లో ఊహించని విధంగా రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. ఇక నిన్నటి రోజున సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా తాను నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే చిత్రాన్ని రీ రిలీజ్ చేయడం జరిగింది.

Killi Killi Song Lyrics From Gudumba Shankar

ఈ క్రమంలోని ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాని రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ -2 వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత నాగబాబు నిర్మించిన ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది మీరాజాస్మిన్ ఇందులో హీరోయిన్ గా నటించింది.

ఇక కీలకమైన పాత్రలు ఆశీస్సు విద్యార్థి , షియజీ షిండే ఉండే నటించారు.. ఈ చిత్రంలోని పాటలు మాత్రం ప్రేక్షకులను బాగా అలరించాయి ఇప్పటికి ఈ పాటలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకి సంగీతం మణిశర్మ అందించారు. ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ఈ సినిమాలను థియేటర్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు చిత్ర బృందం.