బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలె ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. బాలీవుడ్ లవ్‌బర్డ్స్ గా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ ఫిబ్రవరి నెలలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
అయితే ఇప్పుడు కియారా తల్లి కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత ఎక్కువ సమయం తీసుకోకుండా కియారా తన ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్ చెప్పబోతోందని.. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. కియారా ప్రస్తుతం `సత్య ప్రేమ్ కి కథ` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. గతంలో కార్తీక్ ఆర్యన్, కియారా కాంబోలో వచ్చిన `భూల్ బుళాయా 2` సూపర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే సినిమాపై మరింత హైప్ పెంచడం కోసం కియారా కార్తీక్ ఆర్యన్ తో కలిసి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలో, ప్రచారా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె జైపూర్ వెళ్లింది. అక్కడ కియారా ధరించిన డ్రెస్ లో బెల్లీ కనపడుతుండటంతో.. అందరూ షాకైపోయారు. ఈ క్రమంలోనే కియారా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే మరో వాదన కూడా ఉంది. ఆ పిక్ లో కియారాకు ఉన్నది బేబీ బంప్ కాదని.. ధరించిన డ్రెస్ దృష్ట్యా ఆమె అలా కనిపిస్తుందని అంటున్నారు. మరి ఏది నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.