సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ. ఇప్పుడు ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగే షూటింగ్ లో పవన్ కళ్యాణ్ లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా షూట్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాకి సుజీత్ దర్శకుడు. సాహో సినిమా తరువాత సుజీత్ చేస్తున్న సినిమా ఇది. సాహో సినిమాలో ఏ స్థాయి స్టార్ కాస్ట్ పెట్టాడో అంతకు మించేలా ఓజి సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాలో ఎవరు ఎవరు ఉన్నారు అనే ఫోటోలు బయటికి వస్తున్నాయి. ఓజీ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మితో పాటు ఇతర భాషల స్టార్స్ ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయ రెడ్డిలు నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రేయ రెడ్డిలు మాట్లాడుతూ సినిమా మీరు ఊహించినదానికంటే ఇంకా అదిరిపోతోంది అని కూడా చెప్పారు. అర్జున్ దాస్ వాయిస్ ఈ మధ్య కాలంలో ఎంత ఫేమస్ అయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. రోలెక్స అంటూ విక్రమ్ సినిమాలో అర్జున్ దాస్ సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అర్జున్ దాస్ మాట్లాడుతూ ఓజీ సినిమాలో తనే డబ్బింగ్ కూడా చెబుతున్న అని క్లారిటీ ఇచ్చాడు.
పవన్ కళ్యాణ్ చేసే సినిమాలో పెద్ద కాస్ట్ లేకున్నా పవన్ కళ్యాణ్ ఉంటె చాలు. ఆ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ నటించే సినిమా ఓజీలో పవన్ తో పాటు స్టార్స్ ఉన్నారు. అయితే ఓజీ సినిమా కోసం దర్శకుడు సుజీత్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇతర భాషల నుంచి స్టార్స్ ని దించి మరింత హైప్ ని పెంచుతున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా నటిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అమితాబచ్చన్ కూడా ఓజీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పవన్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారట. ఇంత మంది స్టార్స్ ఒకే సినిమాలో ఉంటె పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎక్కువ సేపు కనిపించడేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాని ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.