ఇలియానా ఎక్కువగా బీచ్‌లోనే గడపడం వెనక షాకింగ్ రీజన్..

ప్రముఖ నటి ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. దేవదాస్ సినిమా తర్వాత ఈ గోవా బ్యూటీ మహేష్ బాబుతో నటించే అవకాశం అందుకుంది. మహేష్ బాబు సరసన నటించిన పోకిరి సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక ఆ తరువాత వర్షా అవకాశాలతో స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది.

ప్రస్తుతం ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందనే వ్యాఖ్యలు రావటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అప్పట్నుంచి ఆమె పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇలియానా మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన బేబీ బంప్ కి సంబందించిన ఫోటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది.

తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగితే కొన్ని ప్రశ్నలకు ఇలియానా తన స్టైల్ లో సమాధానం చెప్పింది. ప్రెగ్నెన్సీ సమయంలో మీకు ఏదైనా వింతగా తినాలనిపిస్తుందా అని ఒకరు అడిగిన ప్రశ్నకు ‘ మినీ క్యారెట్స్ ‘ తినాలనిపించింది అంటూ సమాధానం చెప్పింది. అలానే ఇంకొకరు ‘ ఎక్కువగా మీరు బీచ్ లోనే గడుపుతుంటారు మీకు బీచ్ హౌస్ ఉందా?’ అని అడిగిన ప్రశ్నకు, ఇలియానా సమాధానం చెబుతూ ‘నాకు బీచ్ హౌస్ లేదు కానీ బీచ్ దగ్గర వాతావరణం అంటే చాలా ఇష్టం. మనసులో ఎలాంటి బాధ ఉన్నా బీచ్ దగ్గరికి వెళ్లగానే ఆ వాతావరణంనికి నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. అందుకే ఎక్కువగా నేను బీచ్ లోనే గడుపుతాను’ అంటూ సమాధానం ఇచ్చింది.