మినీ డ్రెస్ లో మంట‌లు రేపిన‌ పాయ‌ల్‌.. ఆమె అందానికి ప‌చ్చ గ‌డ్డి అయినా భ‌గ్గుమ‌నాల్సిందే!

పాయల్ రాజ్‌పుత్.. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న్యూఢిల్లీలో జ‌న్మించిన ఈ బ్యూటీ.. పంజాబీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. `ఆర్‌ఎక్స్‌ 100` మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది.

తొలి సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో ఈ అమ్మ‌డు రేపిన పెను దుమారం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ త‌ర్వాత తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించింది. స్పెష‌ల్ సాంగ్స్ కూడా చేసింది.

అయితే కెరీర్ ఆరంభం నుంచి బోల్డ్ రోల్స్ చేయ‌డం వ‌ల్ల స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలు పాయ‌ల్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ప్ర‌స్తుతం ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తితో మంగ‌ళ‌వారం అనే మూవీ చేస్తోంది.

అలాగే త‌మిళంలో గోల్‌మాల్, ఏంజెల్ అనే రెండు సినిమాల్లో భాగ‌మైంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే పాయ‌ల్ తాజాగా మినీ డ్రెస్ లో మంట‌లు రేపింది.

బ్లాక్ అండ్ వైట్ కాంబో డ్రెస్ లో అందంగా ముస్తామైన పాయ‌ల్‌.. ప‌చ్చ‌గ‌డ్డిపై వ‌య్యారాలు పోతూ ఫోటోల‌కు పోజులిచ్చింది. అవి కాస్త నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. కుర్ర‌కారు చూపు తిప్పుకోలేక‌పోతున్నారు. పాయ‌ల్ అందానికి ప‌డ్డ గ‌డ్డి అయినా భ‌గ్గుమ‌నాల్సిందే అంటూ కొంటెగా కామెంట్లు పెడుతున్నారు.