స్టార్ హీరోనే నా కెరియర్ నాశనం చేశారు.. నటుడు పోసాని హాట్ కామెంట్స్..!!

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో రచనతో నిర్మాతగా రాజకీయ నేతగా ఇలా ఎన్నో పాత్రలు చేసి మెప్పించారు. ఎప్పటినుంచో పోసాని వైసీపీ పార్టీకి సపోర్టుగా ఉన్నారు.. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు. గతంలో కూడా పోసాని పవన్ కళ్యాణ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Pawan Kalyan Fans Tried To Attack Posani Krishna Murali!

గత రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ని పొగడ్తల వర్షం కురిపించారు.. పవన్ కళ్యాణ్ చిరంజీవి కన్నా మంచివారని చెప్పడంతో దీంతో పోసానికి సినిమా అవకాశాలు తగ్గాయని అందుచేతనే పవన్ కళ్యాణ్ ని పొగడడంతో వేషాలు వస్తాయని పలువురు నెట్టిజన్లు సైతం కామెంట్లు చేశారు. గతంలో మెగా కుటుంబం పైన విమర్శలు చేయడంతో పోసానికి సినిమా అవకాశాలు రాకుండా చేశారని వార్తలు వినిపించేవి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై పోసానిని అడగగా.. పవన్ కళ్యాణ్ తన కెరియర్ పోగొట్టాడని విషయం పక్కన పెడితే.. ఆయన మంచివాడని ఒప్పుకున్నట్లు తెలిపారు.

ఇక 60 ఏళ్ల వయసులో పాత్రలు ఎక్కడి నుంచి వస్తాయి పవన్ నా కెరియర్ ఆపేసిన తనకు వచ్చిన నష్టం లేదని తనకు అవకాశాల కోసం పవన్ మంచివాడని ఒప్పుకోలేదని అసలు పవన్ మంచివాడు అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని యాంకర్ అడగక.. చంద్రబాబులో మంచితనం లేదు ఆయనతో పోల్చుకుంటే పవన్ మంచివారు చంద్రబాబును ఒకప్పుడు పొగిడి ఇప్పుడు ఎందుకు తిడుతున్నాను అతని బ్యాడ్ బిహేవియర్ వల్లనే ఇక పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అని పేరు పెట్టింది కూడా మంచివాడనే ఆ పేరు నేనే పెట్టాను అని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుతో కలిసి ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నారని తెలియజేశారు.