ప్రభాస్ ఆదిపురుష్ గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు

సాహో, రాధేశ్యామ్ లాంటి యాక్షన్, లవ్ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆదిపురుష్. హిందూవులు పవిత్ర గ్రంథంగా భావించే రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా ఇది. శ్రీరాముడి పాత్రలో హీరో ప్రభాస్ నటించగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించగా.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మాతలు తీశారు. పాన్ ఇండియా సినిమాగా అన్ని ప్రధాన బాషల్లో విడుదల చేస్తున్నారు. జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. 1992లో విడుదల అయిన రామాయణ ద లెజెంట్ ఆఫ్ ప్రిన్స్ రామ అనే యానిమేషన్ సినిమా విడుదల అయింది. ఈ సినిమాను ఆధారంగా చేసుకుని ఓం రౌత్ అదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ మొత్తం రూ.500 కోట్లు ఖర్చు అయింది. తొలుత రూ.400 కోట్లతో సినిమా తీయాలని మేకర్స్ అంచనా వేశారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కావడం వల్ల మరో రూ.100 కోట్లు అదనంగా ఖర్చు చేశారు. ఇక జానకి పాత్ర కోసం తొలుత అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అడ్వాణీ, కీర్తి సురేష్ పేర్లను పరిశీలించారు. కానీ తర్వాత కృతిసనన్ ను ఎంపిక చేశారు.

అలాగే ఈ హై బడ్జెట్ సినిమా కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారట. ఇక ఈ సినిమాకు ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఇండియాలో ఇప్పటివరకు ఏ నటుడు అంత రెమ్యూనరేషన్ అందుకోలేదు. తెలుగు, హిందీలో ఈ సినిమా షూటింగ్ ఒకేసారి జరిగింది. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పగా.. హిందీలో శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పాడు.