ఒకవైపు పెళ్ళాం, మరోవైపు మరదలు.. అనసూయ హస్బెండ్‌ జోరు మామూలుగా లేదే!

ప్రముఖ యాంకర్ అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా అలరించిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అనసూయ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామాలు చేస్తూ తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల అనసూయ షేర్ చేసిన ఒక ఫోటోలో అనసూయతో పాటు తన భర్త సుశాంక్, అనసూయ చెల్లెలు వైష్ణవి ముగ్గురు కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. ఒకవైపు భార్య మరో వైపు మరదలుతో కలిసి సుశాంక్ వర్కౌట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ ఫొటో చూసిన చాలా మంది ఇద్దరు బామల నడుమ ముద్దుల మామయ్యల ఉన్నావ్ శశాంక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలానే ఆ ఇద్దరు అందగత్తెల నడుమ ఎంత సేపు వ్యాయామం చేసినా అలసట రాదు నీకు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సెలబ్రిటిలు ఎంత బిజీ గా ఉన్నపటికీ వ్యాయామం కోసం ఎంతోఅంత సమయం కేటాయిస్తుంటారు. అందం, ఆరోగ్యం లేకపోతే గ్లామర్ ఫీల్డ్ లో రాణించడం చాలా కష్టం. ఇటీవల అనసూయ తన 13వ యానివర్సరీని థాయిలాండ్ లో తన భర్తతో కలిసి జరుపుకుంది. ఆ వెకేషన్లో అనసూయ బికినీలో దర్శనం ఇచ్చింది. ఇదివరకెన్నడూ బికినీలో కనిపించని అనసూయ మొదటిసారి బికినీ వేసుకొని దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ అమ్మడు హాట్ గా దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఆ విషయం పక్కన పెడితే అనసూయ ఈ మధ్య విజయ్ దేవరకొండ మీద ఆరోపణలు చేసింది. విజయ్ తన వద్ద పనిచేసే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి తనపై ట్రోలింగ్ చేయించాడని ఆమె వెల్లడించింది. ఆ విషయం తెలుసి బాధపడ్డాను అని చెప్పింది. ఇక దాంతో విజయ్ దేవరకొండ పై పగ పెంచుకొని వీలు దొరికినప్పుడల్లా అతని టార్గెట్ చేస్తున్నానని కూడా అనసూయ వెల్లడించింది. అయితే ఇకనుండి విజయ్ దేవరకొండ తో వివాదాన్ని కొనసాగించడం తనకు ఇష్టం లేదని అనసూయ తెలిపింది.