పెళ్లైన ఆ హీరోయిన్ తో డేట్ కి వెళ్తానంటున్న వ‌రుణ్‌.. ఆమె ముందు లావ‌ణ్య కూడా వేస్టేనా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న వరుణ్ తేజ్‌.. ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. మరో రెండు మూడు నెలల్లో వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తేజ్‌.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. యాంక‌ర్ అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు. డైరెక్టర్ కొరటాల శివ తో వర్క్ చేయాలని ఉందని, అలాగే ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ఒకరోజు మొత్తం ఉండాలంటే కళ్యాణ్ బాబాయ్ తో ఉంటానని వరుణ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో వరుణ్ తేజ్ రివీల్ చేశాడు.

ఇంతకీ వరుణ్ తేజ్ ను ఇంప్రెస్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.. సీనియర్ స్టార్ బ్యూటీ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారు అంటే తనకు చిన్నతనం నుంచే ఎంతో అభిమానం అని.. ఛాన్స్ వస్తే ఆమెతో డేట్ కు వెళ్లాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టేశాడు. దీంతో వరుణ్ కామెంట్స్ కాస్తా నెట్టింట‌ వైరల్ గా మారాయి. అంటే పెళ్లైన రమ్యకృష్ణ ముందు లావణ్య త్రిపాఠి వేస్టేనా అంటూ నెటిజ‌న్లు వరుణ్ తేజ్ ను సరదాగా ఆట‌ పట్టిస్తున్నారు. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్ `గాందీవధారి అర్జునుడు` అనే సినిమా చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.