తెలుగు సినీ ఇండస్ట్రీలో నటనపరాంగ ఎన్టీఆర్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.. RRR చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిన ఎన్టీఆర్ కు ఈ మధ్యకాలంలో మరింత గుర్తింపు లభించింది పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర అనే చిత్రంలో నటిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ తో మరొక సినిమాని చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ఈ సినిమా అనంతరం బాలీవుడ్లో వార్ -2 చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై నటుడు హృతిక్ రోషన్ కూడా తనదైన స్టైల్ లో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో ఎన్టీఆర్ తెలిపిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఆప్త మిత్రుడు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గురించి మాట్లాడడం జరిగింది.
చిన్న వయసు నుంచే.. ఎన్టీఆర్ కొడాలి నాని ఇద్దరు కూడా మంచి స్నేహితులే.. కొడాలి నాని కూడా గతంలో ఎన్నోసార్లు ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ క్రమంలోనే కొడాలి నాని గురించి ఎన్టీఆర్ చెప్పిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే నేను కొడాలి నాని మంచి స్నేహితులు కొడాలి నాని ఎప్పుడూ కూడా కల్మషం లేని మనిషి అంటూ తెలిపారు.. తనకోసం ఎంతోమంది ప్రాణాలు ఇచ్చే స్నేహితులు ఉన్నప్పటికీ తాను మాత్రం కొడాలి నాని అంటే ప్రాణం ఇస్తానంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి.