పట్టుచీరలో మైమరిపిస్తున్న హీరోయిన్ నందిత.. కొంగుచాటు అందాలతో..

హీరోయిన్లు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఫొటోషూట్ల ఫొటోలతో పాటు ఏదైనా టూర్‌కి వెళ్లినప్పుడు అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ముద్దుగుమ్మ నందిత శ్వేత చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలలో నందిత తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టకుంటోంది.

2016లో హీరో నిఖిల్ నటించిన ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలో నటించి నందిత శ్వేత ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకుంది. నితిన్ హీరోగా వచ్చిన శ్రీనివాస కల్యాణం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా అనేకమంది హీరోల సరసన నటించగా.. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతూ ఉంటుంది. కెరీర్ మొదట్లో కాస్త సాంప్రదాయబద్ధంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హాట్ హాట్ దుస్తుల్లో యువకులను రెచ్చగొడుతోంది. హాట్ ఫొటోలతో సోషల్ మీడియానే షేక్ చేస్తోంది.

అయితే తాజాగా చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేయగా.. వీటిల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంది. పట్టుచీర ధరించి మెడలో బంగారం ధరించి ఈ ఫొటోలో ఈ బ్యూటీ కనువిందు చేసింది. సాంప్రదాయబద్దంగా చీరలో కనిపించడంతో ఫ్యాన్స్ తొలిసారి ఈ లుక్‌లో చూసి మైమరిచిపోతున్నారు. చీరలో నందితా శ్వేతా చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. హాట్ హాట్ దుస్తుల్లో కంటే చీరకట్టులో అందంగా కనిపిస్తుందని కామెంట్ చేస్తోన్నారు. అయితే నందిత శ్వేత తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించింది. అలాగే ఫిమేల్ లీడ్ పాత్రలను కూడా పోషించింది.