బాలయ్య `NBK 109` లో హీరోయిన్ ఫిక్స్‌.. క‌త్తిలాంటి ఫిగ‌ర్‌నే దింపుతున్నారుగా!?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌ల అవ్వ‌బోతోంది.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే బాల‌య్య త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించాడు. ఇటీవ‌ల వాల్తేరు వీర‌య్య‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాబీతో త‌న 109వ చిత్రాన్ని ప్రారంభించింది. బాల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా జూన్ 10వ తేదీన `ఎన్‌బీకే 109` పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా స్టార్ట్ అయింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న చిత్రమిది.

త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా మేక‌ర్స్ క‌త్తిలాంటి ఫిగ‌ర్ ను దింపుతున్నారు. ఇంత‌కీ ఆమె మ‌రెవ‌రో కాదు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ఈ మ‌ధ్య బాలీవుడ్ లో విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోస్తూ హెడ్ లైన్స్ లో నిలుస్తున్న త‌మ‌న్నా.. ఎన్‌బీకే 109లో హీరోయిన్ గా పిక్స్ అయింద‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ని అంటున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే బాల‌య్య‌, త‌మ‌న్నా కాంబోలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది.