ఉపాసన గర్భవతి అని తెలియగానే చరణ్ ఏం చేసాడో తెలుసా..? మెగా హీరో మహా రొమాంటిక్ ఫెలోనే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్.. ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని ..తన సినిమాకి సంబంధించిన విషయాలను సైతం అదే రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా దూసుకుపోతున్నాడు . రీసెంట్ గానే ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డు అందుకున్న రామ్ చరణ్ తేజ్ ..త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఎస్ మెగా కోడలు ఉపాసన గర్భవతి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఉపాసన తన భర్తకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది . ఉపాసన తల్లి అవ్వాలని రామ్ చరణ్ తండ్రి అవ్వాలని మెగా ఫ్యామిలీ మెగా అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు . మెగా కోడలు గుడ్ న్యూస్ చెప్తే వినాలి అనేది మెగా అభిమానుల కోరిక . ఎట్టకేలకు పదేళ్ల తర్వాత అలాంటి గుడ్ న్యూస్ వినిపించిన ఉపాసన ..ఫస్ట్ టైం తను ప్రెగ్నెంట్ అని తెలియగానే రామ్ చరణ్ ఏం చేశాడో చెప్పి అభిమానులకు సర్ప్రైజ్ చేసింది .

ఉపాసన మాట్లాడుతూ..” చరణ్ చాలా సైలెంట్ . నేను చాలా తొందరగా పడుతూ ఉంటాను. నేను ప్రెగ్నెన్సీ విషయాన్ని ముందు చరణ్ కి చెప్పినప్పుడు ఆయన చాలా కూల్ గా రియాక్ట్ అయ్యాడు. చరణ్ నాకు ప్రెగ్నెనెన్సి వచ్చిందని డౌట్ గా ఉంది అంటూ చెప్పగానే తొందరపడకు ..టెస్టు చేయించుకుని కన్ఫర్మ్ చేసుకుందాం” అంటూ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. అదే నాకు చరణ్ లో చాలా ఇష్టం . నేను ఇంత ప్రశాంతంగా ఉండడానికి మెయిన్ రీజన్ చరణే ” అంటూ టాప్ సీక్రెట్ ను బయట పెట్టేసింది . అంతేకాదు ప్రెగ్నెన్సీ దాల్చినప్పటి నుంచి వీళ్ళు మహామహా రొమాంటిక్ గా తయారైపోయారు. ఫారిన్ కంట్రీస్ కి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ స్టిల్స్ సోషల్ మీడియాలో రచ్చ రంబోలా లా లేపేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండు లాంటి పాపకి లేదా..? బాబుకి జన్మనివ్వబోతుంది..!!