ఓటిటిలోకి వచ్చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ సైతాన్.. ఎక్కడంటే..?

యాత్ర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్ మహీ వీ రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. దీంతో గత కొన్ని రోజుల క్రితం ఓటీటిలో సేవ్ ది టైగర్స్ అనే పేరుతో ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఇప్పుడు సైతాన్ అంటూ మరొక వెబ్ సిరీస్తే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు డైరెక్టర్ మహీవి రాఘవ

ముఖ్యంగా ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు బూతు పదాలు ఎక్కువగా ఉన్నాయని అయితే సిరీస్ కు ముందే ఈ విషయంపై ప్రేక్షకులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు డైరెక్టర్ మహి.. సమాజంలో జరిగే ఎటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సైతాన్ అనే సిరీస్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అది కూడా ఒక సెక్షన్ ఆడియన్స్ కోసమే ఈ వెబ్ సిరీస్ అన్నట్లుగా ఈ డైరెక్టర్ తెలియజేశారు. అలా రిలీజ్ కు ముందే ఎంతో హైట్ క్రియేట్ చేసిన సైతాన్ వెబ్ సిరీస్ ఓటీటి లోకి రావడం జరిగింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు నుంచి స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా రివెంజ్ యాక్షన్ రామాక తెరకెక్కించిన సైతాన్ వెబ్ సిరీస్లో దేవయాని శర్మ, కామాక్షి భాస్కర్ల, అనూష ధామ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. క్రైమ్ థ్రిల్లర్ ను ఇష్టపడేవారు సైతాన్ సిరీస్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.ఇందులో బోల్డ్ సన్నివేశాలు హింస బూతు పదాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే మంచిదని తెలుస్తోంది.