సింపుల్ డ్రెస్‌లో సూపర్ క్యూట్‌ గా మెరిసిన సమంత.. పిక్స్ వైరల్!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటిస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలానే సమంత హిందీలో ‘సిటాడేల్ ‘ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ సెర్బీయాలో జరుగుతుంది.

అంతేకాకుండా ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాలో కూడా సమంత నటిస్తుంది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోకి జంటగా నటించబోతుంది సమంత. దాంతోపాటుగా హిందీలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఒక సినిమాలో ఘోస్ట్ రోల్ లోసమంత నటించబోతుంది అని సమాచారం. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది సామ్. దానికోసం తెలుగు సినిమా ఛాన్స్‌లను కూడా వదులుకుంటుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి నందిని రెడ్డి దర్శకత్వంలో సామ్ ఒక సినిమాలో నటించాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయిందట.

అనారోగ్యం బారిన పడి కోలుకున్న సమంత వరుస సినిమాలతో మునపటిలా బాగా బిజీగా ఉంటుంది. ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఈ అమ్మడు ఆన్‌లైన్‌లో సాకి పేరుతో ఒక ఫ్యాషన్ స్టోర్‌ని నడుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒక కొత్త బ్రాండ్ తో సాకి ఉత్పత్తులని సామ్ ప్రమోట్ చేస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా సమంత ఒక సింపుల్ అండ్ క్యాజువల్ లుక్ లో కనపడింది. అందులో చాలా క్యూట్ గా కనిపించింది. సమ్మర్ కాస్ట్యూమ్‌ను సాకి బ్రాండ్ కి సమంత ప్రమోట్ చేస్తుంది. వాటికి సంబందించిన డ్రెస్ ధరించి ఫోటోలను సాకి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి షేర్ చేసింది. పెయింట్ విత్ లవ్ పేరుతో ఈ కాస్ట్యుమ్స్ పేరుతో సామ్ ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుంది.