శాకుంతలం: ఫ్లాప్ సినిమాకే అన్ని అవార్డులా..?

ఈ ఏడాది డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ రోలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతకు కూడా భారీగా నష్టాన్ని చెవి చూసింది.శాకుంతలం పాత్రల సమంత దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు.

Shaakuntalam' Telugu movie review: Samantha gets her moments but this  mythological romance is a misfire with subpar writing and visual effects -  The Hindu

భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీగానే నష్టాల్ని మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన ఈ చిత్రం ఇప్పుడు అవార్డులు మాత్రం క్యూ కడుతున్నాయి. గతంలో ఈ చిత్రానికి న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు 2023 బెస్ట్ ఫాంటసీ ఫిలిం గా బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ గా అవార్డులు రాగా ఇప్పుడు కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా అవార్డును కొల్లగొట్టింది.గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకలలో శాకుంతలం చిత్రానికి సంబంధించి ఒకేసారి నాలుగు విభాగాలలో అవార్డులు రావడం గమనార్హం.

బెస్ట్ ఫారిన్ ఫిలిం ,బెస్ట్ ఫాంటసీ ఫిలిం, బెస్ట్ క్యాస్ట్ ఇన్ డిజైన్, బేస్ట్ ఇండియన్ ఫిలిం క్యాటగిరీలలో సత్తా చాటుతోంది. ఈ విషయాన్ని గుణశేఖర్ టీం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా థియేటర్లో విడుదలై నెల రోజులలోపే ఓటీటి లోనే విడుదలయ్యింది. ఇక ఇందులో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా భరతుడి పాత్రలో నటించింది. ఈమె నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అవార్డులు మాత్రం భారీగా రావడంతో సమంతా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gunaa Teamworks (@gunaa_teamworks)