ఓటీటీ గురించి ముందే ఊహించిన కమల్… కానీ ఎవరూ నమ్మలేదట!

నిన్న మొన్నటి వరకు సినిమా అంటే థియేటరే. ఒక్కసారి థియేటర్ కి వెళ్లి అభిమానులు తమ అభిమాని హీరో బొమ్మ చూసుకొని ఊగిపోయేవారు. అభిమాన సంఘాలు, ఈలలు, గోలలు, కలర్ పేపర్లతో సినిమా హాల్స్ తడిసి ముద్దయ్యేవి. కానీ నేడు పరిస్థితి మారింది. ఇప్పుడంతా ఓటీటీల కాలం నడుస్తోంది. సినిమా హాల్స్ లో గోలలు చేసేవారు ఇపుడు ఇంట్లో కూర్చొని చాయ్ తాగుతూ తమ కుటుంబంతో కలిసి సినిమా చూస్తున్న పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఓటీటీ విప్లవంపై కమల్ హాసన్ కొన్ని సంవత్సరాల క్రితమే కామెంట్స్ చేసారని ఎంతమందికి తెలుసు?

అవును, ఈ విషయాన్ని అప్పుడు అతను చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదట. ఇప్పుడు అదే నిజమైందని అని తాజాగా కమల్ ఓ మీడియా వేదికగా మాట్లాడారు. విషయం ఏమంటే 2013లో కమల్ హాసన్ దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘విశ్వరూపం’ని ఓటీటీ మాధ్యమంగా రిలీజ్ చేయాలని చూసారు. అది అప్పట్లో పెద్ద వివాదం ఐన సంగతి అందరికీ విదితమే. థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రాజెక్టును వదిలేశారు. దీనిపై తాజాగా కమల్ స్పందించారు.

ఈ నేపథ్యంలో, అబుదాబిలో మీడియాతో కమల్ హాసన్ మాట్లాడుతూ… అప్పటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల సంగతి గురించి చెప్పుకొచ్చారు. కానీ అప్పుడు సినిమా పరిశ్రమ నా ప్రకటనను అంగీకరించలేదు. నేను ఏమి చెప్పాలనుకున్నానో అందరికీ ఈ రోజు అర్థమైంది…. అంటూ చెప్పుకొచ్చారు. అవును, కమల్ చెప్పినట్టే ఇపుడు దేశమంతటా ఓటీటీల హవా నడుస్తోంది. ఇకపోతే, మే 27న అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో కమల్ కు ఐఫా జీవితకాల సాఫల్య పురస్కారం అందించిన సంగతి అందరికీ తెలిసినదే.