ఆ హీరో లేకపోతే సింగర్ చిన్మయి, రాహుల్ రవీంద్రన్ పెళ్లి జరిగేదే కాదు..??

సింగర్ చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్‌ల జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్మయి ఒకవైపు డబ్బింగ్ చెబుతూ మరోవైపు సింగర్ గా తన కెరీర్ ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. ఇక సమంత వాయిస్‌కి చిన్మయి వాయిస్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. సమంత నటించిన చాలా సినిమాలకి చిన్మయే డబ్బింగ్ చెప్పింది. ఇక రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు, కానీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు.

 

ఇక సింగర్ చిన్మయి,రాహుల్ రవీంద్రన్‌కి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. చిన్మయి గతంలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలనం సృష్టించి వార్తలలో నిలిచింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వైరుమత్తు ఆమెని లైంగిక వేధింపులకు గురి చేశాడని తమిళ పరిశ్రమలో రచ్చ రచ్చ చేసింది. కానీ తమిళ్ ఇండస్ట్రీలో అతను ఒక పెద్ద మనిషి కావడంతో చిన్మయికి ఎవరి నుండి సపోర్ట్ లభించలేదు. అయినా కూడా చిన్మయి ఏ మాత్రం భయపడకుండా ఇప్పటికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూనే ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే రాహుల్, చిన్మయి జంట ఈటీవీలో ప్రసారమయ్యే సెలబ్రిటి టాక్ షోకి హాజరయ్యారు. వెన్నెల కిషోర్ హోస్ట్ చేస్తున్న ‘అలా మొదలైంది’ షోకి ఈ ప్రేమ జంట హాజరై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా వీరి టాక్ షోకి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ షోలో చిన్మయి రాహుల్ ప్రేమకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే వారిద్దరిని కలిపింది ఒక హీరో అని విషయం బయట పెట్టారు. చిన్మయి రాహుల ప్రేమ పెళ్లి వరకు వెళ్లడానికి కారణం హీరో సందీప్ కిషనట. ప్రస్తుతం అలా మొదలైంది ప్రోమో బాగా వైరల్ అవుతుంది.