మరో చిన్నారి ప్రాణం నిల‌బెట్టిన‌ మ‌హేష్ బాబు.. నిజంగా నువ్వు దేవుడు సామి!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గొప్ప న‌టుడే కాదు గొప్ప మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఓవైపు హీరోగా, నిర్మాత‌గా, వ్యాపారవేత్త‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూన్నాడు. ముఖ్యంగా హృద్రోగాలతో బాధపడే చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు.

ఇప్ప‌టికే వెయ్యికి పైగా చిన్నారుల‌కు ఆప‌రేష‌న్ చేయించి వారి గుండె చ‌ప్పుడుగా మారాడు. తాజాగా మ‌రో చిన్నారి ప్రాణం నిల‌బెట్టాడు. తన ఫౌండేషన్‌ ఆధ్వర్యలో రెండేళ్ల బాలుడికి ఉచితంగా గుండె ఆపరేషన్‌ చేయించాడు. కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన రెండేళ్ల కార్తికేయ అరుదైన గుండె జబ్బుకు గుర‌య్యాడు.

గుండెలో హోల్‌ ఉందని చెప్పిన వైద్యులు.. ఆప‌రేష‌న్ చేయాల‌న్నార‌ట‌. కానీ పేద‌రికం వ‌ల్ల కార్తికేయ‌ను త‌ల్లిదండ్రులు ఆప‌రేష‌న్ చేయించ‌డం భారంగా మారింది. ఈ విష‌యం తెలుసుకున్న మ‌హేష్ బాబు.. త‌న ఫౌండేష‌న్ ద్వారా స‌ద‌రు బాలుడికి ఫ్రీ హార్ట్ స‌ర్జరీ చేయించారు. ఇప్ప‌టికే ఈ పిల్లాడు కోలుకుని హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ఈ విషయాన్ని మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. దీంతో నెటిజ‌న్లు, అభిమానులు నిజంగా నువ్వు దేవుడు సామి అంటూ మ‌హేష్ బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

https://twitter.com/MBfoundationorg/status/1663071197951840256?s=20