లైఫ్ లో ఫస్ట్ టైం సురేఖను చీట్ చేసిన చిరంజీవి.. ఆ నైట్ మెగాహీరో జీవితంలో ఓ పీడ కల..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడమే కాదు తన పేరు చెప్పుకొని నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చే లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా మెగాస్టార్ చిరంజీవి .. తన పేరుని మలుచుకున్నాడు . అంటే అది నిజంగా ఆయనలోని గొప్పతనం అనే చెప్పాలి . ఇలాంటి స్థాయికి రావడానికి ఆయన ఎన్ని తిప్పలు పడ్డారు ..ఎన్ని కష్టాలు ఫేస్ చేశారో .. ఎంత కష్టం అనుభవించారు ఊహించుకుంటుంటేనే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటాయి అంటుంటారు మెగా ఫ్యాన్స్.

కాగ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు. లైఫ్ లో ఎప్పుడూ సురేఖకు సారీ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా విషయంలో మాత్రం సురేఖను హార్ట్ చేశారట. సురేఖకు సారీ చెప్పారట . ఆ నైట్ ఆ సీన్ డిలీట్ చేయించే వరకు చిరంజీవి నిద్రపోలేదట . అందుకే ఆయన ఆ రాత్రిని తన లైఫ్ లోకి పీడకలగా భావిస్తారట. ఇంతకీ ఏం జరిగిందంటే….

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు తీశారు. తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ . ముఖ్యంగా ఇండస్ట్రీలో వీళ్ల కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రగా నిలిచిపోయి. అలాంటి ఓ కాంబోలో వచ్చిన ఆణిముత్యం లాంటి సినిమానే “ఘరానా మొగుడు”. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నగ్మా , వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించి సినిమాకి మరొక క్రేజీ హైప్ ని తీసుకొచ్చారు . దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే దేవి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా టాలెంటెడ్ కీరవాణి స్వరాలు సమకూర్చారు . ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . మరీ ముఖ్యంగా సినిమాల్లో “పండు పండు” అనే సాంగ్ ఇంకా బాగా హిట్ అయింది .

కాగా ఈ సినిమాలో “పండు పండు” అనే పాటలు చిరంజీవి నగ్మా మధ్య లిప్ లాక్ సీన్ పెట్టాలని రాఘవేంద్రరావు మొదటి నుంచి అనుకున్నారట . ఆ విధంగానే ఆయన ఫోర్స్ చేసి బలవంతంగా లిప్ లాక్ చేయించారట . అయితే ఆ సీన్ అయిపోయిన రాత్రి చిరంజీవికి మనసు అంగీకరించలేదట . ముందుగానే సురేఖతో అలాంటి సీన్స్ చేయను అంటూ ప్రామిస్ చేశారట . మరి అలాంటి మంచి భార్యను చీట్ చేయడం చిరంజీవికి మనసు ఒప్పలేదట . ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి రాఘవేంద్రరావు పర్మిషన్ తీసుకొని ఆ సీన్స్ ను కట్ చేసి డిలీట్ చేయించారట. అతి కష్టం మీద అందుకు రాఘవేంద్రరావు ఒప్పుకున్నారట . దాంతో ఆయన లిప్ లాక్ సీన్స్ ని తొలగించారు . ఆరోజు ఆ సీన్స్ తొలిగించేవరకు చిరంజీవి నిద్రపోలేదట . అలా ఆరోజు ఆయన లైఫ్ లో పీడకలగా మారిపోయింది..!!