ఎన్టీఆర్ లైఫ్ కి లక్ష్మి ప్రణతి అంత బ్యాడ్ లక్కా..?..నెటిజన్స్ ఊహించని కామెంట్స్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేస్తూ అడ్డు అదుపు లేకుండా ట్రోల్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బిగ్ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ చిన్న ఇష్యూ దొరికిన ఏకిపారేస్తూ వచ్చారు. ఈ లిస్టులో మెగా ఫ్యామిలీ టాప్ పొజిషన్ లో ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని దగ్గుబాటి ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా ఫ్యామిలీకి సంబంధించిన డివర్స్ విషయంలో కానీ దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన శ్రీరెడ్డి విషయంలో కానీ జనాలు ఎప్పటికప్పుడు ఈ రెండు ఫ్యామిలీస్ ని ఏకిపారేస్తూ ఉంటారు .

కాగా గతంలో నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా ఇదే స్థాయిలో ట్రోల్ చేశారు అన్న వార్త మరోసారి ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు . పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో హ్యాపీగా లైఫ్లో ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రజెంట్ గ్లోబస్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న తారక్ “దేవర” సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటించడానికి ఫిక్స్ అయ్యాడు.

కాగా లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ కి సరైన హిట్టు పడలేదు. చాలా కాలం హిట్ కొట్టడానికి నాన్న తండాలు పడ్డాడు . ఊసరవెల్లి దగ్గర నుంచి రభస వరకు వరుసగా ఫ్లాప్స్ అందుకుంటూ సినీ ఇండస్ట్రీలో తన గ్రాఫ్ ని తగ్గించుకునేసారు . వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే అలాంటి క్రమంలోనే కొందరు ఆకతాయిలు పనికట్టుకొని మరి లక్ష్మీపతి టార్గెట్ చేసే ట్రోల్ చేశారు .

లక్ష్మీ ప్రణతి ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ లైఫ్ ఇలా మారిపోయిందని ..పెళ్లికి ముందు చాలా బాగా పిక్స్ కి చేరుకుందని ..ఆమె ఆయన లైఫ్ లోకి వచ్చాక ఇలా మారిపోయిందని ట్రోల్ చేశారు . ఆ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వాళ్లకి ఇచ్చి పడేశారు. ప్రెసెంట్ ఎన్టీఆర్ లైఫ్ ఈ రేంజ్ లో ఉండడానికి కారణం లక్ష్మీ ప్రణతి అంటూ ఫ్యాన్స్ బల్లగుద్ది చెప్తున్నారు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి లక్ష్మీ ప్రణతి మెయిన్ రీజన్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు .