తగ్గని సమంత జోరు.. తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న అమ్మడు..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని సంపాదించుకుంది.

సమంత తమ మొదటి సినిమాలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి అతని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత నాలుగేళ్లకి ఇద్దరిమధ్య కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. చైతన్యతో విడిపోయిన తరువాత కూడా సామ్ ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇటీవలే సమంత నటించిన శాకుంతలం సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమా లో నటిస్తుంది. ఈ అమ్మడుకి ప్లాపులు ఎదురైనప్పటికి వరుస సినిమాలతో దూసుకుపోతూనే ఉంది.

 

సమంత ద్విభాషా చిత్రమైన చెన్నై స్టోరీలో కూడా యాక్ట్ చేస్తోంది. చెన్నై స్టోరీ అనేది అప్‌కమింగ్ ఇంగ్లీష్ రోమ్ కామ్ డ్రామా. ఇది భారతీయ రచయిత టైమెరి ఎన్. మురారి 2004లో రాసిన నవలకి అనుసరణ. మొన్నటిదాకా ఇండియన్ లాంగ్వేజ్‌లలోనే యాక్ట్ చేసిన సామ్ ఇప్పుడు ఇంగ్లీష్ భాషలలో కూడా యాక్ట్ చేస్తూ అదరగొడుతోంది.