`జ‌యం` మూవీకి గోపీచంద్ అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అస్స‌లు న‌మ్మ‌లేరు!

యంగ్ స్టార్ నితిన్‌, స‌దా జంట‌గా న‌టించిన ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `జ‌యం` సినిమాను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేరు. డైరెక్ట‌ర్ తేజ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌నే కాదు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకున్నాడు. 2003లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

అప్ప‌ట్లో ఈ సినిమా రూ. 18 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. అలాగే ఈ సినిమాలో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ విల‌న్ గా అద‌ర‌గొట్టేశాడు. త‌న‌దైన ప‌ర్ఫామెన్స్ తో ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. నిజానికి జ‌యం కంటే ముందు `తొలి వ‌ల‌పు` మూవీతో హీరోగా గోపీచంద్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో గోపీచంద్ కు హీరోగా ఆఫ‌ర్లు ద‌క్క‌లేదు.

ఇక వ‌చ్చిన అవ‌కాశాల‌నే స‌ద్వినియోగం చేసుకోవాల‌ని డిసైడ్ అయిన గోపీచంద్.. జ‌యంలో విల‌న్ గా న‌టించేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఈ సినిమాకు గోపీచంద్ అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..? రూ. 11,000 మాత్ర‌మే. ఇదే గోపీచంద్ మొద‌టి రెమ్యున‌రేష‌న్ కూడా. ఈ సినిమా త‌ర్వాత నిజం, వ‌ర్షం చిత్రాల్లో విల‌న్ గా మెప్పించిన గోపీచంద్‌.. మ‌ళ్లీ `యజ్ఞం` వంటి సూప‌ర్ హిట్ మూవీతో హీరోగా ట‌ర్న్ తీసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆయ‌న వెన‌క్కి తిరిగి చూసుకోలేదు.