ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని క్షమాపణలు కోరిన శాక్రిఫైజింగ్ స్టార్..!!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ రేంజ్ లో ఉంది.ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎవరైనా కామెంట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అభిమానులు రియాక్ట్ అవుతూ ఉంటారు.. గత కొద్దిరోజులుగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు శాక్రిఫైజింగ్ స్టార్ సునిషిత్.. ముఖ్యంగా టాప్ హీరోల పైన హీరోయిన్ల పైన పలు వాక్యాలు చేస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటారు.

Jr NTR: Inappropriate Comments On NTR.. Sunishith Needs To Explode Again! »  Jsnewstimes

ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన పైన కూడా కామెంట్లు చేశారు. ఉపాసనతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లానని తెలియజేయడంతో ఈ విషయం విన్న రాంచరణ్ అభిమానులు అతన్ని చితకొట్టి క్షమాపణ చెప్పించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ మరో ఇంటర్వ్యూల సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీఆర్ పెద్ద హీరో కదా కానీ అతను అశ్లీల చిత్రాలలో నటించారు.. ఈ విషయం టాలీవుడ్ లో ఎవరు చెప్పరు నేను తప్ప అంటే సునిషిత్ వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో ఈ వాక్యాలు తెగ వైరల్ గా మారాయి.

ఈ మాటలు విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా సైతం సునిసితుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. దీంతో భయపడిన సునిషిత్ ఎన్టీఆర్కు క్షమాపణలు చెప్పారు.. నన్ను నా ఫ్యామిలీ ని దయచేసి ఇబ్బంది పెట్టవద్దు తారక్ పైన చేసిన కామెంట్లు కేవలం పాపులారిటీ కోసమే చేశాను క్షమించండి అంటూ కోరుతున్నారు.. ఇకపైన అలాంటి వ్యాఖ్యలు చేయను నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే అంటూ వ్యాఖ్యానించారు ఇకపై ఇలాంటివి జరగవు అని సునిషిత్ ఒక వీడియోలో తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.