సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంగ్లీష్ మూవీకి సమంత కమిట్ అయిందని.. `చెన్నై స్టోరీ` అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది.
ఇందులో హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా హీరో కాగా.. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అట. ఇంగ్లాండ్ దేశానికి చెందిన అబ్బాయిగా వివేక్ కల్రా, చెన్నైకి చెందిన అమ్మాయిగా సమంత కనిపిస్తుందని రెండు రోజుల నుంచి జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
సమంత సైన్ చేయాల్సిన ఈ హాలీవుడ్ మూవీని యంగ్ బ్యూటీ శ్రీలీల లాగేసుకుని బిగ్ షాక్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. సమంతను కాదని శ్రీలీలను హీరోయిన్ గా ఎంపిక చేశారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. కాగా, టాలీవుడ్ లో శ్రీలీల ప్రస్తుతం యంగ్ సెన్షేషన్ గా మారింది. వచ్చి రెండేళ్లు కాకముందే చేతి నిండా ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా మారిపోయింది.