లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ కొద్ది రోజుల క్రితం ప్రముఖ స్టార్ హీరో అజిత్ కుమార్ ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. `AK62` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించాల్సి ఉంది.
కెరీర్ లోనే తొలిసారి అజిత్ వంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో విఘ్నేష్ ఎంతో సంబరపడ్డారు. కానీ, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి విఘ్నేష్ ను తొలగించారు. అందుకు కారణం అజిత్ అంటూ ప్రచారం జరిగింది. విఘ్నేష్ తయారు చేసిన స్క్రిప్ట్ అజిత్ ను మెప్పించలేకపోయిందని.. అందుకే అతడిని తొలగించారంటూ ప్రచారం జరిగింది.
అంతేకాదు, ఈ కారణంగా అజిత్-విఘ్నేష్ మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయంపై విఘ్నేష్ నోరు విప్పాడు. `అజిత్ తో నా సినిమా ఆగిపోవడం చాలా బాధగా ఉంది. ఈ విషయంలో అజిత్ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. నేను రాసిన స్టోరీలో సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ నిర్మాతలకు నచ్చలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది` అంటూ విఘ్నేష్ స్పష్టం చేశారు. ఇకపోతే విఘ్నేష్ స్థానంలో మగిజ్ తిరుమేని అజిత్ 62వ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.