బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన సినిమాలు ఎన్నో తెలుసా..!?

నందమూరి తారకరామారావు తెలుగు చిత్ర పరిశ్రమలోనే తిరుగులేని కథానాయకుడు. ఏ పాత్ర చేసిన అవలీలగా మెప్పించగల మహాగునుడు. తెలుగులోనే నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్నకు నిలువెత్తు సమాధానం. ఎన్టీఆర్ సినిమాలతోనే కాకుండా రాజకీయాల్లో కూడా తిరుగులేని రికార్డులు సృష్టించారు. ఆయన నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగులోనే స్టార్ హీరోగా రాణిస్తున్నారు. 40 సంవత్సరాలకు పైగా హీరోగా సినిమాలు చేస్తున్న ఏకాక హీరోగా బాలయ్య రికార్డ్ సృష్టించాడు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి పలు సినిమాల్లో నటించారు ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

తాతమ్మ కల:
1974లో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ నటుడిగా తెరంగేట్రం చేసారు.ఈ సినిమాలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కనబరిచారు.తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్‌లో బాలయ్యకు ఇది ఫస్ట్ మూవీ.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

అన్నదమ్ముల అనుబంధం:
తండ్రి ఎన్టీఆర్‌తో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం అన్నదమ్ముల అనుబంధం.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.నిజ జీవితంలో తండ్రి కొడుకులైన ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించడం విశేషం.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

వేములవాడ భీమకవి:
తండ్రి ఎన్టీఆర్‌తో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం వేములవాడ భీమకవి.ఈ చిత్రంలో బాలయ్య టైటిల్ రోల్ పోషించడం విశేషం.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

దాన వీర శూర కర్ణ:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన నాల్గో చిత్రం దాన వీర శూర కర్ణ.ఈ చిత్రంలో బాలయ్య అభిమన్యుడు పాత్రలో నటించి మెప్పించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది. ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్.శ్రీకృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధునుడిగా మూడు పాత్రల్లో విభిన్నమైన నటన కనబరిచి మెప్పించారు.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

అక్బర్ సలీం అనార్కలి:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం ‘అక్బర్ సలీం అనార్కలి’.ఈ చిత్రంలో ఎన్టీఆర్ అక్బర్ పాత్రలో నటిస్తే.బాలయ్య.సలీం పాత్రలో నటించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.ఈ చిత్రానికి డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన పాటలు పెద్ద హిట్టైయ్యాయి.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

శ్రీ మద్విరాట పర్వము:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఆరో చిత్రం శ్రీ మద్విరాట పర్వము.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ, అర్జున, దుర్యోధన, కీచకుడు, బృహన్నలగా ఐదు పాత్రలు పోషించారు.బాలయ్య ఈ చిత్రంలో మరోసారి అభిమన్యుడు పాత్రలో నటించాడు.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఏడో చిత్రం శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం.ఈ చిత్రంలో ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తే.బాలయ్య నారదుడి పాత్రలో నటించారు.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

రౌడీ రాముడు కొంటె కృష్ణుడు:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన ఎనిమిదో చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్ణుడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

అనురాగ దేవత:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన తొమ్మిదో చిత్రం అనురాగ దేవత.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

సింహం నవ్వింది:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పదో చిత్రం ‘సింహం నవ్వింది’.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పదకొండో చిత్రం శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర గోల్డెన్ జూబ్లీ సక్సెస్ సాధించింది.

Telugu Balakrishna, Danaveera, Son, Simham Navvindi, Tatamma Kala, Tollywood-Tel

బ్రహ్మర్షి విశ్వామిత్ర:
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పన్నెండో చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర.ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయింది.ఈ చిత్రంతో ఎన్టీఆర్ నటన విమర్శల పాలైంది.ఇలా బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో 10కి పైగా సినిమాలలో నటించి ఏ హీరోకి అందని అరుదైన ఘనతను అందుకున్నాడు.