టీజర్: అదరగొట్టేస్తున్న పుష్ప చిత్రం టీజర్..!!

గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గడిచిన రెండు రోజుల క్రితం తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు అనే విషయం పైన ట్రెండీగా మిగిలింది.. దీంతో దానికి ఆన్సర్ తేలిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది.

ఇప్పుడు పుష్ప-2 తో అందరికీ అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం జరిగింది. సుకుమార్, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అందుకు సంబంధించిన ఒక టీజర్ ని కూడా విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులలో ఫుల్ జోష్ నింపుతోంది.ఈ టీజర్ అధ్యయంతో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మూడు నిమిషాలు ఉన్న ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పించే విధంగా కనిపిస్తోంది. పుష్ప అసలు బతికే ఉన్నారా లేక పోలీసులు చంపి డ్రామాలాడుతున్నారా అని అనుమానాలు తెలియజేస్తూ పోలీసులు నుంచి తప్పించుకోవడానికి పుష్ప విదేశాలకు పారిపోయాడు అని చర్చలు జరుగుతున్న సమయంలో..

వీటన్నిటి మధ్య పుష్ప శేషచల అడవుల్లో కనిపించినట్లుగా చూపించి హైట్ పెయిన్ చేశారు సుకుమార్ వీడియో మాత్రం అదిరిపోయేలా ఉందని ఇక అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేరీశాయంటే పులి వచ్చిందని అర్థం అదే పులి రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్థం అనే డైలాగ్ బాగా పాపులర్ అవుతోంది చివరిలో ఇది పుష్పరాజు రూలని చెప్పే షాట్ వీడియోకి హైలైట్ గా నిలుస్తోంది.