ఇటీవలే మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు బయటికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కి సంబంధించి ఒక వీడియోను మనోజ్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.. దీనిపై మోహన్ బాబు సీరియస్ అవ్వడంతో ఆ వీడియోని విష్ణు వెంటనే డిలీట్ చేయడం జరిగింది. అటుపై మంచు లక్ష్మి కూడా ఈ వివాదం గురించి స్పందించడం జరిగింది.. అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే ఏ ఇంట్లో కూడా గొడవలు ఉండవా అంటూ విష్ణు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక తర్వాత మనోజ్ చేసిన కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.విష్ణు ని ఉద్దేశించి మాట్లాడినట్లుగా ఉన్నాయని కొంతమంది నెట్టిజాన్లు సైతం తెలియజేయడం జరిగింది. అయితే ఈ వాదం అనంతరం నేడు కుటుంబ సభ్యులతో కలిసి మొదటిసారి తిరుపతికి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మోహన్ బాబు, విష్ణు ,మనోజ్ అతని భార్య భూమ మౌనిక రెడ్డి కూడా హాజరయ్యారు..
ఈ సందర్భంగా కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి మీడియా ప్రతినిధులు అడగగా మోహన్ బాబు ఇలా స్పందించారు.. నీ ఇంట్లో నీ భార్యకు నీ మధ్య సంబంధం ఏమిటో చెప్పగలవా? తప్పయ్య? చదువుకున్న విజ్ఞానులు మీరు ..మీరందరూ నాకు ఇష్టం ఎప్పుడు ఏది అడగాలో అది అడగాలి సమయం సందర్భం ఉండాలి. మీరందరూ తెలుసు మీరందరూ నాకు కావాలి నేను వచ్చిన పనేంటి హాస్పిటల్ ఓపెనింగ్ ఇది అత్యంత అద్భుతంగా ఉండాలి డాక్టర్స్ మంచి వాళ్ళు ఉన్నారు అంటూ నా అభినందనలు అంటే తెలిపారు.. ఇక మనోజ్ కూడా ఈ విషయంపై చాలా వ్యయంగా మాట్లాడారు.. తను బరంపురం అనే సినిమాని మొదలు పెట్టబోతున్నట్లు తెలిపారు కెనడాలు షూటింగ్ చేస్తున్నామంటూ తెలియజేయడం జరిగింది..