నిఖిల్ స్పై డిజిటల్ రైట్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

కార్తికేయ-2 తో పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్పై అనే మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రా ఏజెంట్గా నికీల్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా తో ఎడిటర్ గ్యారీ దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను కూడా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నికీల్ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Spy Movie (2022): Nikhil Siddharth | Cast | Trailer | Songs | First Look |  Release Date - News Bugz
ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఏకంగా రూ.40 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నికిల్ మార్కెట్ రేంజ్ కూడా వాస్తవానికి ఈ స్థాయిలో లేదు కానీ కార్తికేయ-2 సినిమా సూపర్ సక్సెస్ కావడంతోపాటు రూ .100 కోట్ల క్లబ్ లోకి రావడంతో ఇప్పుడు స్పై సినిమాకి ఏకంగా రూ .40 కోట్లు డిమాండ్ వచ్చిందని మాట వినిపిస్తోంది. నాన్ థియేటర్ రైట్స్ డీల్ కూడా ఈ స్థాయిలో వస్తే థియేట్రికల్ బిజినెస్ అన్ని భాషలలో కలిపి రూ .60 కోట్ల వరకు జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ మార్కెట్ వ్యాల్యూమ్ తో ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఔట్ పుట్ చూసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వారు డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై ఇంకా ఆసక్తి నెలకొంది. నిఖిల్ కూడా సినిమాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని వ్యవహరిస్తున్నారు.