హిట్ కొట్టాక కూడా ఇదేం కర్మ కీర్తి.. మహానటికి మైండ్ దొబ్బిందా..ఏంటి..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా . శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . అంతేకాదు నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డ్ ని నెలకొల్పింది. ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీలో దసరా సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

కాగా ఈ సినిమాలో హీరోయిన్ నటించిన కీర్తి సురేష్ ఎంతటి క్రేజీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ చేసిన పెళ్లి తర్వాత చేసిన బరత్ డాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ప్రతి ముద్దుగుమ్మ అమ్ముడు లాగే డాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ కోలీవుడ్లో ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధపడింది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

ఈ క్రమంలోనే ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు . తెలుగులో బోలెడు అవకాశాలు రెడీగా ఉన్నాయని .. ఇలాంటి టైంలో అమ్మడు ఐటెం సాంగ్ చేస్తే ఆఫర్స్ బ్యాక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు . అంతేకాదు కీర్తి సురేష్ ఇలాంటి టైం లో ఈ డెసిషన్ తీసుకుంది ఏంటి అంటూ మండిపడుతున్నారు. మైండ్ దొబ్బిందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఎందుకు ఐటెం సాంగ్ చేయాలనుకున్నది అనే ప్రశ్న హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే కీర్తి సురేష్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో పెద్ద అర్థం ఉంటుంది అంటున్నారు ఫాన్స్ . చూడాలి మరి దీనిపై కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తుందో..?