కర్నూలులో హైకోర్టు..జగన్ ఎత్తులకు లోకేష్ చెక్..కొత్త హామీ.!

జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక రాజకీయ కోణం ఉంటుందనే చెప్పాలి. అందులో ఎలాంటి డౌట్ లేదు. అదే క్రమంలో మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంటే దీని ద్వారా టి‌డి‌పి హయాంలో తీసుకొచ్చిన అమరావతిని దెబ్బకొట్టడం, అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రాజకీయంగా లబ్ది పొందడం జగన్ వ్యూహం. కానీ ఈ వ్యూహం పూర్తిగా విఫలమవుతుంది. మూడు రాజధానులు అని చెప్పి..మూడేళ్లు దాటిన రాజధానికి దిక్కు లేదు. అసలు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పలేని పరిస్తితి.

అయితే జగన్ నిర్ణయాన్ని అటు ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మడం లేదు. అసలు విశాఖలో రాజధాని కాదు కావాల్సింది..అభివృద్ధి అంటున్నారు. ఇటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ ఇప్పటికే రాజ్యాంగబద్ధంగా అమరావతిలో హైకోర్టు పెట్టేశారు. ఇప్పుడు కర్నూలుకు తరలించాలంటే అతి పెద్ద ప్రక్రియ..అది ఇప్పటిలో అవ్వడం కష్టం..ఆ విషయం జగన్‌కు తెలుసు…కాకపోతే రాజకీయంగా లబ్ది పొందడానికి జగన్ వేసిన ఎత్తు..ఇప్పుడు దాన్ని టి‌డి‌పి చిత్తు చేసే దిశగా వెళుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో వైసీపీకి టి‌డి‌పి చెక్ పెట్టే పరిస్తితి ఉంది.

ఇదే క్రమంలో రాయలసీమలో కూడా వైసీపీని టి‌డి‌పి నిలువరించనుంది. ఈ క్రమంలోనే తాజాగా లోకేష్ కర్నూలులో పాదయాత్ర చేస్తూ..అక్కడ లాయర్లకు కీలక హామీ ఇచ్చారు. టి‌డి‌పి అధికారంలోకి రాగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇది సాధ్యం అయ్యే అవకాశం ఉంది.

జగన్ చెప్పే అబద్దాలు తియ్యగా ఉంటాయని, కానీ తాము చెప్పే నిజాలు చేదుగా ఉంటాయని..జగన్ నాలుగు ఏళ్లలో కర్నూలులో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అన్నారు.  మొత్తానికి ఈ హామీ గాని ప్రజల్లోకి వెళితే సీమలో టి‌డి‌పికి అడ్వాంటేజ్ అవుతుంది.