అతిలోకసుందరి శ్రీదేవి, బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ధడక్ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత వరస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కొరటాల- ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR30 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా జాన్వీ కూడా ఈ షూటింగ్లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా అలరించబోతున్నాడు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ కూడా పలు సినిమాలు నటిస్తుంది జాన్వీ కపూర్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తనకు కాబోయే భర్త గురించి మాట్లాడింది. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తనకు కాబోయేవాడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి, నన్ను కేరింగ్ గా చూసుకునే వ్యక్తి, అన్నికంటే ముఖ్యం మా నాన్న కంటే హైట్ ఉండే వ్యక్తి కావాలని ఆమె అన్నారు.