ఉరవకొండ బరిలో పయ్యావుల..1994 రిపీట్ చేస్తారా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు నిఓయోజకవర్గాలు పూర్తి చేసుకున్న పాదయాత్ర ప్రస్తుతం ఉరవకొండలో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ..టి‌డి‌పి అభ్యర్ధులని ప్రకటించేస్తున్నారు. కొన్ని స్థానాల్లో సీట్లు తేల్చడం లేదు గాని..మిగిలిన స్థానాల్లో పోటీ చేసేది ఎవరో తేలుస్తున్నారు. ఇటీవల రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయడం ఖాయమని, వారిని గెలిపించాలని కోరారు.

ఇప్పుడు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ని గెలిపించాలని ఆయన కోరారు. దీంతో ఉరవకొండ బరిలో మళ్ళీ పయ్యావుల బరిలో దిగడం ఖాయం. అయితే ఉరవకొండలో పయ్యావులకు ఒక సెంటిమెంట్ ఉంది..ఆయన గెలిస్తే రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి రాదు. గత కొన్ని ఎన్నికల నుంచి అదే జరుగుతుంది. ఇక ఆయన ఓడిపోతే టి‌డి‌పి అధికారంలోకి వస్తుంది. 1999 ఎన్నికల్లో ఆయన ఓడిపోతే, టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది.

ఇక 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల గెలిచారు..కానీ టి‌డి‌పి అధికారంలోకి రాలేదు. 2014లో పయ్యావుల ఓడిపోతే టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో పయ్యావుల గెలిచారు..టి‌డి‌పి అధికారంలోకి రాలేదు. కేవలం 1994 ఎన్నికల్లోనే పయ్యావుల గెలవడం, టి‌డి‌పి అధికారంలోకి రావడం జరిగాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుందని పయ్యావుల అంటున్నారు.

నెక్స్ట్ ఎన్నికల్లో పయ్యావుల గెలవడం, టి‌డి‌పి అధికారంలోకి రావడం జరుగుతాయని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఉరవకొండలో పయ్యావులకు ఎడ్జ్ ఉంది..ఇటు రాష్ట్రంలో టి‌డి‌పి బలపడుతుంది. చూడాలి మరి 1994 సీన్ 2024లో రిపీట్ అవుతుందేమో.